హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి ఎంపీ అవినాష్ రెడ్డి వచ్చారు. వెనకాల గేట్ నుండి వెళ్లారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు ఎంపీ అవినాష్ రెడ్డి. ఈ కేసులో అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు రావడం ఇదే తొలిసారి.
ప్రస్తుతం సీబీఐ కార్యాలయంలో అవినాష్ రెడ్డి విచారణ ప్రారంభమయ్యింది. ఢిల్లీ సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ నేతృత్వంలో విచారణ కొనసాగుతుంది. సంఘటన జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారన్న అంశాలపై అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో లభించిన అధారాలపై విచారణ జరుగుతుంది. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఇప్పటికే 248 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించారు.
ఆయా వాంగ్మూలాల ఆధారంగానే సీబీఐ అధికారులు అవినాష్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. తమ నేతను విచారిస్తున్న నేపథ్యంలో, కోఠిలోని సీబీఐ కార్యాలయం వద్దకు అవినాష్ రెడ్డి అనుచరులు భారీగా తరలివచ్చారు.