ట్యాంక్‌బండ్‌పై పోలీసుల దౌర్జన్యంపై ఎంపీ బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఆర్టీసీ కార్మికులకు సంఘీభావంగా తామంతా అండగా ఉంటామని స్పష్టం చేశారు. లాఠీ చార్జీ ద్వారా మీరేం సాధించలేరని, పోలీసులకు వ్యతిరేకంగా తాము ఉద్యమించటం లేదని స్పష్టం చేశారు.
మీరెన్ని అడ్డంకులు సృష్టించినా… ఊరుకునేది లేదని, లాఠీచార్జీలకు కేసులకు బెదిరింపులకు భయపడమని స్పష్టం చేశారు. ఫాంహౌజ్‌లో కూర్చోని చూడటం కాదు, ఏ మిలియన్ మార్చ్‌తో అధికారంలోకి వచ్చావో… అదే మిలియన్ మార్చ్‌తో నిన్ను గద్దె దించుతాం కేసీఆర్ అంటూ హెచ్చరించారు ఎంపీ బండి సంజయ్.
ఈ సందర్భంగా పోలీసులకు ఎంపీ సంజయ్ ఓ సలహ ఇచ్చారు. మీకు మేం వ్యతిరేకం కాదు… రేపు మీకు ఎదైనా ఇబ్బందికర పరిస్థితులు వస్తే మేమే అండగా ఉండేది, అప్పుడు మీరు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమిస్తుంటే తోడుండేది మేమే… అనవసరంగా కేసీఆర్ చెప్పాడని కార్మికులపై లాఠీ చార్జీ చేయొద్దంటూ కోరారు.