సీఎం కేసీఆర్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశానని తనపై కేసులు పెట్టారని, తాము కేసులకు భయపడమని, జైళ్లకు, రిమాండ్లకు భయపడేది లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ పైనే కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
పీవీ, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చేస్తామని అక్బర్ అంటే సీఎం ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఆనాడు సీఎం స్పందించి ఉంటే, తాను అలా మాట్లాడేవాడిని కాదన్నారు. హిందువులను చులకన చేస్తే సహించేదిలేదని కుండబద్దలు కొట్టారు. కులసంఘాల పేరుతో మీటింగులు పెడుతున్న టీఆర్ఎస్ నాయకులకు సిగ్గు లేదన్నారు.
సీఎం కేసీఆర్‌కు ఎన్నికలప్పుడే జనం గుర్తుకు వస్తారని, కరోనా వ్యాక్సిన్‌పై సమీక్షకు ఢిల్లీ నుంచి ప్రధాని వస్తుంటే తనను పిలవలేదని సీఎం అంటున్నారని, మరి ఇన్నిరోజులు ఏం చేశారని ప్రశ్నించారు. సీఎంకు వ్యాక్సిన్ అవసరం లేదని, ప్రైవేట్ ఆసుపత్రులతో సీఎం కుమ్మక్కయ్యారని ఆరోపించారు. వరదలప్పుడు రాని పీఎం ఇప్పుడు వస్తున్నారని కేటీఆర్ అంటున్నారని, మరి కేసీఆర్ ఫాం హౌజ్‌లో పడుకున్నారని ప్రగతిభవన్ వదలి రాలేదు కదా అని విమర్శించారు.