పాతబస్తీపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు హీరోలని, భాగ్యనగర్‌లో బీజేపీని గెలిపించండని పిలుపునిచ్చారు. పోలీసులకు 15 నిమిషాలు స్వేచ్ఛను ఇస్తామని, పాకిస్థాన్ కుక్కలను, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లను, రోహింగ్యా లుచ్చాలను బయటకు గుంజి తరిమేస్తామని కామెంట్ చేశారు. భాగ్యనగరానికి బీజేపీ ఒక్కటే రక్షణ కవచమన్నారు.
బండి సంజయ్ డాక్టర్లతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో ప్రసంగించారు. పాతబస్తీలో హిందువుల జనాభా ఎందుకు తగ్గుతోందని ఆయన ప్రశ్నించారు. శాలిబండ, అలియాబాద్, ఉప్పుగూడ, లాల్ దర్వాజ, గౌలిపుర, చాతార్నాకా వంటి ప్రాంతాల్లో ఉన్న హిందువులు ఎక్కడకి పోయారని, హిందువుల ఆస్తులను ఎవరు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. హిందువుల ఆస్తులు ఎవరు కబ్జా చేశారని మండిపడ్డారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలవబోతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.