తన సూర్యాపేట జిల్లా గుర్రంబోడు తండా పర్యటనలో బీజేపీ శ్రేణులపై కేసులు నమోదు చేయటాన్ని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. కిందిస్థాయి కార్యకర్తలను వేధిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
కార్యకర్తలతో కలిసి మళ్లీ సూర్యాపేటకు వెళ్తానని.. దమ్ముంటే ఆపండని తెలంగాణ పోలీసులకు బండి సంజయ్ సవాల్ విసిరారు. కాషాయ కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. తెరాస నేతలు గిరిజనుల భూములను లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. గుర్రంబోడు తండాలో హైకోర్టు ఉత్తర్వులు పనిచేయడంలేదని విమర్శించారు.
సీఎం కేసీఆర్ కమిటీలు వేసేది కేవలం కాలయాపన కోసమేనని… అబద్ధాల సీఎంను ప్రజలెవరూ విశ్వసించారన్నారు.