బాలీవుడ్ నటి అమీషా పటేల్ కు మధ్యప్రదేశ్ కోర్టు సమన్లు జారీ చేసింది. వచ్చే సంవత్సరం జనవరి 27న కోర్టుకు హాజరుకావాలని ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. రూ.10 లక్షల చెక్ బౌన్స్ కేసులో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది. సినిమా నిర్మాణం కోసమని నిర్మాత నిషా చిప్పా దగ్గర అమీష రూ.10 లక్షలు అప్పు తీసుకుంది. ఆ తర్వాత ఆ డబ్బులకు అమీష పటేల్ చెక్ ఇచ్చిన చెక్ బౌన్స్ కావడంతో ఆయన కోర్టులో కేసు వేశారు.
2000 సంవత్సరంలో రొమాంటిక్ థ్రిల్లర్ ‘కహో న…ప్యార్ హై’ సినిమాతో రాకేష్ రోషన్ సరసన బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన అమీష ఆ తర్వాత 2001 లో ”గదర్ : ఏక్ ప్రేమ్ కథ”సినిమాతో పాపులర్ అయ్యింది. ఈ సినిమా బాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి.