డిగ్రీ రెండో సంవత్సరం విద్యార్థులకు భగవద్గీతను ఒక సబ్జెక్టుగా తీసుకువచ్చేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రెడీ అవుతోంది. రాబోయే విద్యాసంవత్సరంలో ఈ నిర్ణయాన్ని అమలు చేయనున్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.
విద్యార్థులకు లైఫ్ మేనేజ్ మెంట్, విలువల గురించి బోధించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి మోహన్ యాదవ్ తెలిపారు.
జీవితంలో విలువల ప్రాధాన్యత గురించి విద్యార్థులు తెలియజేసేందుకే ఈ నిర్ణం తీసుకున్నామని చెప్పారు. ఆధునిక విద్యతో పాటు భారత చరిత్ర గురించి కూడా విద్యార్థులు తెలుసుకోవాలని నూతన విద్యావిధానం చెబుతోందన్నారు.
రామాయణ, మహాభారతాలు కేవలం మత గ్రంధాలు మాత్రమే కాదన్నారు. అవి మనకు విలువలు, జీవిత సారాన్నిబోధిస్తాయని అన్నారు. గతంలో గుజరాత్, కర్ణాటక ప్రభుత్వాలు సైతం ఇలాంటి నిర్ణయాలను తీసుకున్నాయి.