బీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వర రావు ఈడీ కేసు పై హైకోర్టు యాథాతథ స్థితి విధించింది. ఈ కేసులో వాదనలకు మరికొంత గడువు కావాలని ఈడీ కోరింది. దీంతో తదుపరి విచారణ మార్చి 3 కి వాయిదా వేసిన కోర్టు అప్పటి వరకు స్టేటస్ కో విధించింది.
రాంచీ ఎక్స్ ప్రెస్ వే కేసులో మధుకాన్ గ్రూప్ కు చెందిన 96 కోట్ల ఆస్తులను ఈడీ గతేడాది అటాచ్ చేసింది. అయితే రాంచీ హైవే కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ కేసును కొట్టివేయాలని నామా నాగేశ్వర్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధుకాన్ గ్రూప్ కంపెనీలకు 2009 లోనే రాజీనామా చేశానని సీబీఐ,ఎఫ్ఐఆర్,చార్జిషీట్ లోనూ తన పేరు లేదని పిటిషన్ లో నామా అన్నారు.
నామా పిటిషన్ పై స్పందించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి గతంలోనే ఆదేశాలు ఇవ్వగా తాజాగా ఇవాళ ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. అయితే వాదనలకు ఈడీ మరికొంత గడువు కోరడంతో ఈడీ కేసును యథాతథంగా ఉంచిన కోర్టు విచారణను మార్చి 3 కు వాయిదా వేసింది. దీంతో నామా నాగేశ్వర రావుకు ఎదురు చూపులు తప్పడం లేదు.