కేసుల నుంచి తప్పించామని కోరేందుకే జగన్ ఢీల్లీలో పర్యటిస్తున్నారని ఆరోపించారు ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్. ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని చెప్పిన జగన్.. తన ఢీల్లీ పర్యటనలో ఆ అంశాన్ని లేవనెత్తడం లేదన్నారు. 25మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పి.. కేంద్రంతో బేరాలు ఆడుతున్నారన్నారు. ప్రత్యేక హోదాపై కేంద్రంతో స్పష్టమైన ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు కనకమేడల. జగన్ పర్యటనలో ఢిల్లీ పెద్దల నుంచి ఆశించిన సమాధానం రాలేదని చెప్పారు. మంత్రి బొత్స ఎన్డీయేలో చేరుతామని అంటున్నారని.. ఈ విషయమై జగన్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్ర నిధులు, ప్రాజెక్ట్‌లు సాధించి ఎన్డీయేలో చేరాలని.. కానీ ఇవేవీ సాధించకుండా కేంద్రప్రభుత్వంతో జత కడితే ప్రజలు సహించబోరని తెలిపారు.