రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. రెండు దేశాల సైన్యం ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం పోరాటం సాగిస్తున్నారు. అయితే.. రష్యా సేనల ముందు ఉక్రెయిన్ బలగాలు నిలబడలేకపోతున్నాయి. ఈ క్రమంలోనే సామాన్య జనం ఆయుధాలు పడుతున్నారు.
దేశాన్ని రక్షించాలనుకుంటున్న ఎవరైనా ముందుకు రావాలని.. వారికి ఆయుధాలు ఇస్తామని దేశ అధ్యక్షుడు పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ కు మద్దతుగా పోరాడదామని చెప్పారు. దీంతో కొందరు ఉక్రెయిన్ సైన్యానికి మద్దతుగా గన్స్ చేతబట్టారు.
సామాన్యులే కాదు సెలెబ్రిటీలు, ప్రముఖులు సైతం గన్ అందుకున్నారు. తాజాగా మహిళా ఎంపీ కిరా రుడిక్ గన్ తో ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ట్విట్టర్ లో ఫోటో పోస్ట్ చేసిన ఎంపీ.. “నేను గన్ ఉపయోగించడం నేర్చుకున్నా. ఆయుధాలు ధరించడానికి సిద్ధమవుతున్నా. పురుషుల మాదిరిగానే స్త్రీలు కూడా మన మట్టిని కాపాడుతారు” అని ట్వీట్ చేశారు.