కేంద్రమంత్రి కిషన్ రెడ్డి టీఆర్ఎస్ పై ధ్వజమెత్తారు. ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ రాజకీయం చేస్తుందని మండిపడ్డారు.
బాయిల్డ్ రైస్ కొనుగోలుపై టీఆర్ఎస్ ప్రభుత్వమే అగ్రిమెంట్ చేసుకుందని.. మళ్లీ ఇప్పుడు మెడ మీద కత్తి పెట్టి సంతకం చేపించుకున్నారని అనడం దారుణమని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌కు భయపడేదిలేదని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓడించినందుకు శాపనార్థాలు పెడుతున్నారని మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.