తిరుపతి వేదికగా జన ఆశీర్వాద యాత్ర ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనతోపాటు ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో తీర్థప్రసాదాలను అందజేశారు పండితులు.
దేశంలో కరోనా ప్రభావం తగ్గాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎర్రచందనం స్మగ్లింగ్ పై పలు వ్యాఖ్యలు చేశారాయన. ఇందులో ఇతర దేశాల నేరస్తులకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి.. ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారం తీసుకోవాలని సూచించారు. రెడ్ శాండిల్ మాఫియాను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం అన్నివిధాలుగా సాయం చేస్తుందని చెప్పారు కిషన్ రెడ్డి.