బ్రెయిన్ డెడ్ అయి ఇతరులకు అవయవ దానం చేసిన పేద రైతు నర్సిరెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భువనగిరిఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భరోసా ఇచ్చాఉ. నల్గొండ జిల్లా మోత్కూరుకు చెందిన వరకాంతం నర్సిరెడ్డి అనే పేద రైతు ఈనెల 30న బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడం దురదృష్టకరమన్నారు. అయిన సరే ఆపదలో ఉన్న ఇతరుల జీవితాలను నిలబెట్టడానికి వారి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చి గుండె దానం చేయడం గొప్ప విషయమన్నారు తాను మరణిస్తూ ఐదుగురు జీవితాలను కాపాడిన నర్సిరెడ్డి, వారి కుటుంబ సభ్యులు చరిత్రలో నిలుస్తారని కొనియాడారు.
వారి కుటుంబానికి నర్సిరెడ్డి లేని తీర్చలేనిదే అయిన ఇబ్బందులు తలెత్తకుండా తక్షణ సాయంగా లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేస్తామన్నారు. అలాగే ఇరువురు పిల్ల చదువుకు అయ్యే ఖర్చును తన కొడుకు పేరు మీద ఏర్పాటు చేసిన ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా చేపట్టి వారి జీవితంలో స్థిరపడే వరకు అండగా ఉంటామని తెలిపారు.
మంగళవారం మెట్రోలో కామినేని ఆసుపత్రి నుండి జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించిన గుండె నర్సిరెడ్డిదే. నర్సిరెడ్డి నుండి సేకరించిన గుండెను అత్యవసరంగా హైదరాబాద్ మెట్రో రైలులో తరలించి, శస్త్ర చికిత్స చేసి… మరొకరి ప్రాణం కాపాడారు.