పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతామంటూ హాట్ కామెంట్స్ చేశారు ఎంపీ మాలోతు కవిత. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ నేత బండి సంజయ్ పై నిప్పులు చెరిగారు. ఎమ్మెల్సీ కవితపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న బండి సంజయ్ ను వెంటనే పిచ్చి ఆస్పత్రిలో చేర్పించాలన్నారు.
పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పుతో కొడతామంటూ కవిత వార్నింగ్ ఇచ్చారు. మీడియా ముందుకు వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బండి సంజయ్ కి అక్కా చెల్లెళ్లు లేరా? అని నిలదీశారు.
ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ ను బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలని కోరారు. ఎమ్మెల్సీ కవితపై బండి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అదే విధంగా క్షమాపణలు చెప్పాలని ఎంపీ కవిత డిమాండ్ చేశారు.
కాగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తప్పులు చేసి సిగ్గులేకుండా ఢిల్లీకి వెళ్లి దీక్షలు చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దీంతో పలువురు బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.