వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు మరోసారి జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విశాఖలో ప్రభుత్వ, ప్రైవేటు, దసపల్లా భూములను హెల్త్ రిసార్ట్ పేరిట కొనుగోలు చేశారని ఆరోపణలు చేశారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేయాలనుకుంటున్నారా అంటూ ఎంపీ ఫైర్ అయ్యారు. ఈ భూముల కొనుగోళ్లు ఇన్ సైడర్ ట్రేడింగ్ కాదంటారా? అని విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు రఘురామకృష్ణ రాజు.
సీతమ్మధారతో పాటు భీమిలి అవతలి వైపు భారీగా భూ కుంభకోణాలు జరిగాయన్నారు. అనకాపల్లిలో వాగులు, వంకలు పూడ్చేసి దాదాపు 500 ఎకరాల్లో లేఅవుట్లు వేశారని విమర్శించారు. అక్కడి రైతులతో బలవంతంగా భూములను అగ్రిమెంట్ చేయించుకుంటున్నారని దూయబట్టారు.
బాధితులు సమావేశం ఏర్పాటు చేసుకుంటే, అక్కడ వైసీపీ కార్యకర్తలు వారిని మోహరించి భయభ్రాంతులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాతే భూములు కొనుగోలు చేశామంటారా? అని నిలదీశారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు.