వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంత పార్టీపై, సీఎంపై ఎలా రియాక్ట్ అవుతారో అందరికీ తెలిసిందే. స్వపక్షంలోనే విపక్ష పాత్ర పోషిస్తున్నారు. ఏ చిన్న అవకాశం దొరికిన జగన్, వైసీపీ టార్గెట్ గా ఘాటైన విమర్శలు చేస్తున్నారు.
అయితే, సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఎంపీ విష్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే, తన ట్యాగ్ లో జగన్ ను ట్యాగ్ చేశారు కానీ గారు, అన్న ఇలాంటి పదాలేవీ గౌరవవాచకంగా సంబోధించలేదు. పైగా ఆ ట్వీట్ తో పాటు జత చేసిన ఫోటోను కూడా ఆసరాగా చేసుకొని ఇప్పుడు నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
కొందరేమో మీరు చేయి వదిలించుకోవాలనుకుంటున్న జగన్ వినటం లేదు, ప్రాదేయపడుతున్నారుగా అని కొందరు… గారు పోయిందని కొందరు… ఇంకాస్త డోస్ పెంచి సినిమా డైలాగ్స్ సైతం వాడేస్తున్నారు.
Warm birthday greetings to our Chief Minister Shri @ysjagan.💐@AndhraPradeshCM #HBDYSJagan pic.twitter.com/ECwBnZs1j2
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) December 21, 2020
Advertisements