ఏపీ రాజకీయాల్లో రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు.ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారుడికి కూడా ఇల్లు ఇవ్వలేదని ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. జగనన్న గృహ పథకాల్లో భారీ దోపిడీ జరిగిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో
మాట్లాడుతూ ఇంటికి ఒక్క రూపాయి కూడా కట్టవద్దని ఎన్నికల ప్రచారంలో జగన్ అన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
సగం ఇళ్లు మంజూరు చేసినా నిర్మాణం చేపట్టలేదని ఆరోపించారు. ప్రధానమంత్రి స్కీమ్ కింద రూ. లక్షా 50 వేలు వస్తుందని, ఏపీ ప్రభుత్వం ఇచ్చేది రూ.30 వేలు మాత్రమేనని ఆయన అన్నారు. ప్రజలు రూ.5 లక్షలు అప్పు చేసి ఇల్లు కట్టుకుంటున్నారని, జగన్ ప్యాలెస్ వీడి కాలనీలను సందర్శించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అడిగే హక్కు గవర్నర్‌కు ఉంటుందన్నారు. గత గవర్నర్ ఆమోదించిన జీవోలను కోర్టు కొట్టివేసిందని రఘురామ పేర్కొన్నారు.కొత్త గవర్నర్‌తో రాజ్యాంగ సంరక్షణ జరుగుతుందని, అబ్దుల్ నసీర్ మంచి న్యాయ కోవిదుడని ఆయనను ఏపీ గవర్నర్‌గా నియమించారని రఘురామ అన్నారు. అయితే గవర్నర్‌ను మారుస్తారని సీఎం జగన్ ఊహిచించలేదని అన్నారు.
చర్చిలకు, నిర్మాణాలకు ప్రజల సొమ్మును కేటాయిస్తున్నారని, గత గవర్నర్ ఎన్నో జీవోలకు సంతకాలు పెట్టారని.. వాటిని కోర్టు కొట్టేసిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పు చేసిందో అడిగే హక్కు గవర్నర్‌కు ఉంటుందన్నారు.