అయ్యన్నపాత్రుడు ఓ మై సన్ వివాదంపై ఎంపీ రఘురామ కృష్ణరాజు స్పందించారు. చంద్రబాబు ఇంటిపై వైసీపీ నేతల దాడి కరెక్ట్ కాదన్నారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన… జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే చంద్రబాబు ఇంటిపై దాడికి వెళ్లడం ఏంటని ప్రశ్నించారు.
వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తీరుపై మండిపడ్డారు రఘురామ. ఆయన మంత్రి పదవిపై కాంక్షతో రగిలిపోతున్నారని విమర్శించారు. అయినా శాంతియుత నిరసన అని చెప్తూ.. అన్ని కార్లలో వెళ్లడం ఏంటని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబుపై జగన్ ఎన్నో కామెంట్స్ చేశారని… వైసీపీ అధికారంలోకి వచ్చాక మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని గుర్తు చేశారు. మరి.. ఆ వ్యాఖ్యలన్నింటికీ జగన్ క్షమాపణ చెప్తారా అని ప్రశ్నించారు రఘురామ.