జగన్ కు చెడ్డ వారు ఎవరో, మంచి వారు ఎవరో గుర్తించే శక్తి రావాలని కోరుకుంటున్నానని ఎంపీ రఘురామకృష్ణంరాజు అన్నారు. ప్రధాని మోడీ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పూజలు చేసిన ఆయన, గత ఆరున్నర సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పరిష్కరించారని కొనియాడారు.
తనను పార్టీ నుండి బహిష్కరించే దమ్ములేక పార్టీ కార్యక్రమాలకు పిలవటం లేదని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలో ప్రస్తుతం ఆటవిక రాజ్యం నడుస్తందని మండిపడ్డారు. తాను పార్టీ వైఖరికి ఎనాడు విరుద్ధంగా మాట్లాడలేదని, ప్రభుత్వం అవలంభిస్తున్న చర్యలపైనే తన అభిప్రాయాన్ని చెప్తున్నానన్నారు.