పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నేతలు మాట్లాడుతున్న అంశాలపై ఎంపీ రఘురామ స్పందించారు. ఈ ఫలితాలు మూడు రాజధానులకు ప్రజలు జైకొట్టారని చెప్పేందుకే అయితే, రోడ్లు వద్దు, ఉద్యోగాలు భర్తీ వద్దు, సీపీఎస్ రద్దు వద్దు అని, పరిశ్రమలు అభివృద్ధి వద్దు అంటూ జగన్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు సమర్థించినట్లా అంటూ ప్రశ్నించారు.
సీఎం జగన్ తాడేపల్లి నుండి, తాను ఢిల్లీ నుండి కదలటం లేదని… ఇద్దరి పరిస్థితి ఒకటే అంటూ రఘురామ విమర్శించారు. బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామికి ప్రత్యేక విమానంలో వచ్చేంత శక్తి లేదని, అయితే జగన్ తో స్వామి భేటీ జగన్ బెయిల్ రద్దు గురించే అని తాను అనుకోవటం లేదన్నారు. ఎంపీ మార్గాని భరత్ పై ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపణలపై సీఎం చర్యలు తీసుకోవాలని రఘురామ డిమాండ్ చేశారు. ఆవ భూములు, పురుషోత్తపట్నం పథకం భూముల కుంభకోణంలో కోట్లు దోచుకుంటే అదే అర్హతగా భరత్‌కు పక్క నియోజకవర్గం భాధ్యతలు కుడా అందుకే ఇచ్చారా? అని ప్రశ్నించారు.