వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏ ఒక్కరి మనిషి కాదు… ఆయన్ని ఒక్కరికి సంబంధించిన వారిగా చూడలేం… ఆయన అందరి వాడు అంటూ ఇండైరెక్ట్ గా జగన్ కు ఎంపీ రఘురామ కృష్ణం రాజు వ్యాఖ్యానించారు. తను గత 13ఏళ్లుగా వైఎస్ నిలువెత్తు ఫోటోను ఇంట్లో పెట్టుకున్నానని, తనపై ఉన్న అభిమానంతోనే తన మనువడికి వైఎస్ పేరు పెట్టుకున్నట్లు తెలిపాడు.
వైఎస్ ఇప్పుడున్న ముఖ్యమంత్రుల్లా తన పేరుతో పథకాలు మొదలుపెట్టలేదని, ఆయన పేరు పెట్టుకోలేదని… రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ పేర్లు పెట్టుకున్నారని కామెంట్ చేశాడు. వైఎస్ గొప్పనేత… ఆయన్ను కొందరికే పరిమితం చేయకూడదు అన్నారు. ఏపీకి పనిచేసిన గొప్ప ముఖ్యమంత్రుల్లో ఒకరని, ఎంతో మందికి ఆదర్శనీయుడంటూ పొగిడారు.
ఓవైపు జగన్ పై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూనే, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని మాత్రం పొడగటంపై వైసీపీ శ్రేణులు సైతం అయోమయంలో పడ్డాయి. తిట్టారా… పొగిడారా అంటూ చర్చించుకుంటున్నాయి.