నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోసారి సొంత పార్టీ తీరుపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్ తన పుట్టినరోజు కోసం అక్రమ వసూళ్లు చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
సీఎం బర్త్ డే కోసం చిరు వ్యాపారులను పార్టీ కార్యకర్తలు వేధిస్తున్నారన్నారు. డబ్బులు లేదా పండ్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. అభిమానుల తీరుతో పార్టీకి చెడ్డపేరు వస్తోందని వెల్లడించారు. అభిమానుల ఉన్మాద చర్యలపై సీఎం జగన్ జోక్యం చేసుకోవాలని రఘురామకృష్ణరాజు కోరారు.