నర్సాపురం ఎంపీగా తనను నియోజకవర్గంలో పర్యటించకుండా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపిస్తున్న ఎంపీ రఘురామకృష్ణం రాజుకు హైకోర్టు ఊరటనిచ్చింది. నర్సాపురంలో అడుగు పెడితే అరెస్ట్ చేసేలా కేసులు నమోదు చేసిందని ఆరోపిస్తూ హైకోర్టులో ఆయన పిటిషన్ వేయగా, ఆయనను అరెస్ట్ చేయవద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
రఘురామకృష్ణంరాజుపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగా..ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టంచేసింది. కనీసం ఏ కేసులు పెట్టారో కూడా తనకు తెలియదని రఘురామకృష్ణరాజు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఈ అంశంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశామన్నారు.
ఈ అంశంలో స్పీకర్‌కు ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు. స్పీకర్ ఆ నోటీసులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హోంశాఖను ఆదేశించారు. అయినప్పటికీ ఆయన కోర్టును ఆశ్రయించి రిలీఫ్ పొందారు.
చాలాకాలంగా వైసీపీ వర్సెస్ రఘురామగా నర్సాపురం రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో… ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో చూడాలి.