వైసీపీ అధికారంలోకి వచ్చాక బంధుప్రీతితో తమ బంధువులకు మాత్రమే డబ్బులు చెల్లించారని ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. 25 వేల కోట్ల వరకు బకాయి పడిందన్నారు. కనీసం ఉపాధి హామీ పనులకు కూడా డబ్బులు చెల్లించటం లేదని మండిపడ్డారు.
సీఎం జగన్ చెప్పలే విలువలు మన మాటల వరకే కాదని, పనుల్లోనూ ఉండాలని సూచించారు. ప్రత్యేకంగా ఓ సామాజికవర్గం కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం డబ్బులు చెల్లించడంలేదని రఘురామకృష్ణం రాజు ఆరోపించారు. కాంట్రాక్టర్ల కష్టాలు సీఎం దృష్టికి అధికారులు ఎందుకు తీసుకుపోవడంలేదన్నారు.
దేశంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో ఏపీ ఒకటని, సీఎం క్యాపిటల్ పై కాకుండా కరోనాపై దృష్టిపెట్టాలన్నారు. ఏపీకి మూడు రాజధానులు అనేది ఒక భ్రమేనని రఘురామకృష్ణంరాజు ధీమా వ్యక్తం చేశారు.