ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ రఘురామకృష్ణమరాజు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్రిస్మస్ రోజు తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో కనీస పరిజ్ఞానం లేకుండా అమరావతిపై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు.
అమరావతిలో ఎస్సీ వర్గానికి చెందినవారు 50 శాతం పైగానే ఉన్నారన్నారు. సీఎం జగన్ శాస్త్రియ గణాంకాలు తీసుకొని మాట్లాడితే తన స్థాయికి తగ్గట్లుగా ఉంటుందన్నారు. అమరావతిలో కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టే వ్యాఖ్యలు చేయకుండా.. సమన్వయం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రి బాధ్యత లేకుండా మాట్లాడడం వల్ల పార్టీకి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని రఘురామకృష్ణమరాజు వ్యాఖ్యానించారు.