పార్లమెంట్ డిఫెన్స్ కమిటీ సమావేశం నుండి ఎంపీలు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, రాజీవ్ సాతవ్ వాకౌట్ చేశారు. సమావేశంలో త్రివిద దళాల డ్రెస్ కోడ్, బ్యాడ్జ్, ర్యాంకుల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే త్రివిధ దళాల డ్రెస్ కోడ్ అంశంలో అమెరికా మోడల్ ను తీసుకోవాలని ఇద్దరు బీజేపీ ఎంపీలు సూచించారు.
బీజేపీ ఎంపీల సూచనను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. దేశ చరిత్ర, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా డ్రెస్ కోడ్ ఉంటుందని రాహుల్ గాంధీ వివరించే ప్రయత్నం చేశారు. అయితే, రాహుల్ ను మాట్లాడకుండా కమిటీ ఛైర్మన్ జోలమ్ ఓరా అడ్డుకోవటంతో కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓరా తీరు పై అభ్యంతరం వ్యక్తం చేసి, ముగ్గురు ఎంపీలు వాకౌట్ చేశారు.