రైల్వేస్టేషన్లో శ్రీకాకుళం ఎంపీ దీక్ష

శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆకస్మిక నిరాహారదీక్షకు దిగారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన ఆముదాలవలస రైల్వే స్టేషన్లో నిరాహారదీక్ష చేశారు. నిన్న రాత్రి 7గంటలకు నిరాహారదీక్ష చేపట్టిన రామ్మోహన్ నాయుడు ఈ ఉదయం 7గంటల వరకూ 12గంటలపాటు దీక్షలో పాల్గొన్నారు.

ఎంపీ అయి ఉండి ఇలా దీక్షకు దిగాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విశాఖకు రైల్వే జోన్ ఇవ్వాలని, ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఎంపీ దీక్షకు సంఘీభావంగా రామ్మో హన్ నాయుడు అభిమానులు పలువురు పార్టీ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.