శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు పితృత్వ సెలవులు కావాలని లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాకు లేఖ రాశారు. వచ్చే వారం తన భార్య బిడ్డకు జన్మనివ్వనుందని… ఇలాంటి సమయంలో తన వెంటే ఉండటంతో పాటు బిడ్డకు జన్మనిచ్చాక తోడుండాలని కోరుకుంటున్నానని, అందుకు 9 రోజుల పాటు సభా కార్యక్రమాలకు హాజరుకాలేనని సమాచారం ఇచ్చారు.
2017, జూన్ లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి కూతురు శ్రావ్యను రామ్మోహన్ నాయుడు పెళ్లి చేసుకున్నారు.
బిడ్డ సంరక్షణ కేవలం తల్లి బాధ్యత మాత్రమే కాదని, తండ్రిగా బాధ్యత ఉంటుందని… అందువల్ల తనకు సెలవు మంజూరు చేయాలని కోరుతున్నట్లు లేఖ రాశారు.