నల్లా నీళ్ల కోసం, డ్రైనేజీ వ్యవస్థ మెరుగు కోసం, బస్తీల్లో సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఎన్నికలు ఇవి అని ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. ఇక్కడ పోటీలో ఉన్న టీఆర్ఎస్ అభ్యర్థి చెంప పగలగొడుతూ నిలదీశారని, మళ్లీ ఆయనకు మీరు ఒటేస్తారా అంటూ రేవంత్ హాయత్ నగర్ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
బీజేపీలో జెండాలు మోసే వారిని పక్కన పెట్టి మూటలు మోసే వారికి టికెట్ కట్టబెట్టే దుస్థితికి దిగజారిందని, బీజేపీని హయత్ నగర్ లో తూకం పెట్టి అమ్మేశారని విమర్శించారు. హయత్ నగర్ లో కాంగ్రెస్ నేత గుర్రం శ్రీనివాస్ రెడ్డి గెలిస్తే కేసిఆర్ కుర్చీ ఊడిపోదని, మోదీకి ప్రధానమంత్రి పదవి పోదని, కానీ డివిజన్ లో ప్రజల సమస్యలపై నాకు తోడుగా కొట్లాడతడు అంటూ ఓట్లు అభ్యర్థించాడు.
ఎన్నికలు రాంగనే హైదరాబాద్ మీద దొంగల గుంపును వదిలినట్లు కేసీఆర్ తన నేతలను వదిలాడని, ఈ ఎంపీలు, ఈ మంత్రులు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ఎమ్మెల్సీలు కరోనా వచ్చినప్పుడు, వరదల్లో పేదలను కాపాడేందుకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వరదలప్పుడు ఒక్క దొంగనా కొడుకు కూడా రాలేదని, ఆదుకోలేదని, కానీ ఇప్పుడు జిహెచ్ఎంసి ఎన్నికల కోసం మాత్రం వస్తున్నారన్నారు.
జిహెచ్ ఎంసిలో టిఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, అధికారులు కలిపి 250 మంది ఒక్కసైడు ఉంటే నేను ఒక్కడినే ఒక్క సైడు ఉన్న. నాకు సపోర్టుగా 25- 30 మంది కార్పొరేటర్లను ఇవ్వండి. అప్పుడు సర్కారును వంగబెట్టి గుద్ది పనులు చేయిస్తా… అద్భుతాలు చేస్తానంటూ రేవంత్ ఉద్వేగపూరిత ప్రసంగం చేశాడు.