కేసీఆర్ పార్లమెంట్ ను తప్పుదోవ పట్టించాడు… స్పీకర్ అనుమతి కోరామని, బీజేపీ అధిష్టానం అనుమతితో బండారం బయటపెడతానంటూ బండి సంజయ్ హెచ్చరించారు. దీనిపై ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. కేసీఆర్ పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించడం పై నేను రిటన్ కంప్లైంట్ ఇస్తా, చర్యలు తీసుకునే ధైర్యం బీజేపీకి ఉందా అంటూ రేవంత్ సవాల్ విసిరారు. సంజయ్, కేసీఆర్ వేరువేరుగా కనిపించినప్పటికీ ఇద్దరూ ఒక్కటేనని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ కు కేసిఆర్ హాజరు కాకుండా, రిజిస్టర్ లో కేసీఆర్‌కు బదులు మరోకరితో సంతకాలు చేయించారని రేవంత్ ఆరోపించారు. కేసీఆర్ పార్లమెంట్‌కు ఎన్నిసార్లు హాజరయ్యారు? సంతకాలు ఏవరివి? బండి సంజయ్ ఫోరెన్సిక్ టెస్ట్ చేపించగలడా? కేసీఆర్ చదువుకుంది బీఏ… కానీ ఎంఏ చదువుకున్నట్లు పార్లమెంట్‌కు సమాచారం ఇచ్చారన్నారు. బండి, కారు ఒక్కటే. కేసీఆర్‌ను సంజయ్‌ను వేరు వేరుగా చూడలేం అంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు.