కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తన అనుచర వర్గం ఏర్పాట్లు చేస్తోంది. రేవంత్‌కు పీసీసీ రాబోతుందన్న ఊహగానాల మధ్య రేవంత్ పుట్టిన రోజును ప్రత్యేకంగా నిర్వహించాలని ఆయన వర్గం, మద్దతుదారులు ఏర్పాటు కూడా చేసుకున్నారు.
అయితే, పుట్టిన రోజుకు ముందు రేవంత్ రెడ్డి తన కుటుంబాన్ని కూడా వదిలి ప్రయాణమైనట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో ఓవైపు ఆర్టీసీ కార్మికులు పస్తులుండటం, ప్రజలు ఇబ్బందులకు గురవుతున్న నేపథ్యంలో… తన పుట్టిన రోజు వేడుకులకు రేవంత్ రెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ నిర్ణయంతో సంబంధం లేకుండానే… అమెరికాలో తెలంగాణ డెమెక్రాటిక్ అనే ఓ సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. నాలుగైదు రోజుల వరకు అమెరికాలోనే రేవంత్ పర్యటించబోతున్నట్లు తొలివెలుగుకు సమాచారం అందుతోంది.
నేను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటున్నాను, నా అభిమానులు… కార్యకర్తలు నా పుట్టిన రోజు వేడుకలు జరపకుండా మీకు చేతనైనా సహయాన్ని ఆర్టీసీ కార్మికులతో పంచుకోండి అంటూ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ALSO READ: రేవంత్ రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్ మనిషా…?