మంథని కోర్టుకు హజరై వస్తున్న హైకోర్టు లాయర్లు వామనరావు, ఆయన సతీమణి నాగమణిలపై వేట కొడవళ్లతో పాశవిక దాడి జరిగింది. రక్తపు మడుగులో… ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ… వామన్ రావు పుట్ట మధు పేరును ప్రస్తావించారు. ఆ వీడియో కూడా బయటకు వచ్చింది.
ఓ మనిషి చనిపోతూ ఇచ్చిన వాంగ్మూలాన్ని సాక్ష్యంగా పరిగణించాలని కోర్టులు ఎన్నో సందర్భాల్లో చెప్పాయి. పరిగణలోకి తీసుకున్నాయి. కానీ వామనరావు చెప్పిన పేరును మాత్రం కేసులో పోలీసులు ప్రస్తావించకపోవటంపై ఎంపీ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
వామన్ రావు మరణ వాంగ్మూలంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతల పేర్లు చెప్పారు. ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది. నిందితులపై న్యాయస్థానమే చర్యలు తీసుకోవాలి… అంటూ ఎంపీ రేవంత్ రెడ్డి గవర్నర్ తమిళిసై, తెలంగాణ సీఎంవో, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. వామన్ రావు చనిపోతూ చెప్తున్న మాటలకు సంబంధించిన వీడియోను సైతం జత చేశారు.
వామన్ రావు మరణ వాంగ్మూలంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన ముఖ్యనేతల పేర్లు చెప్పారు.ప్రభుత్వం వారిని కాపాడే ప్రయత్నం చేస్తోంది.నిందితులపై న్యాయస్థానమే చర్యలు తీసుకోవాలి..!@DrTamilisaiGuv @TelanganaCMO @TelanganaCS @TelanganaDGP #TelanganaChiefJustice #LawyersNeedJustice pic.twitter.com/DBJm2uswS1
— Revanth Reddy (@revanth_anumula) February 19, 2021