నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల పోరాటం అంతా ఇంతా కాదు. కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూనే ఉన్నారు. ఐక్యమత్యంగా పసుపుకు మద్దతు ధర, పసుపు బోర్డు కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ పోరాటాన్ని రాజకీయ పార్టీలు వాడుకున్నాయి. మొదట టీఆర్ఎస్ నుండి కవిత, ఆ తర్వాత బీజేపీ నుండి ఎంపీ అరవింద్ ఇలా వచ్చిన వారే. కానీ ఈ రెండు పార్టీలు తమను మోసం చేశాయని రైతులు బహిరంగంగానే మండిపడుతున్నారు.
పసుపు రైతులను రాజకీయానికి వాడుకుంటూ, మోసం చేస్తున్న రైతన్నలకు అండగా… రేవంత్ రెడ్డి దీక్ష చేస్తున్నారు. ఆర్మూర్ లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఒక్క రోజు రైతు దీక్షను చేపట్టారు. రేవంత్ దీక్షకు తమ వైపు నుండి ఎవరూ వెళ్లకుండా టీఆర్ఎస్, బీజేపీ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నా… రాజకీయాలకు అతీతంగా, పసుపు రైతుల కోసం దీక్షకు తరలి రావాలని కాంగ్రెస్ పిలుపునిచ్చింది.
పసుపు బోర్డును తెస్తామని చెప్పి మోసం చేసిన టీఆర్ఎస్, బీజేపీ టార్గెట్ గానే… నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి కీలకమైన అంశాన్ని భుజాన వేసుకున్నారని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. మల్లన్నసాగర్ భూ నిర్వాసితుల కోసం రెండ్రోజులు దీక్ష చేసిన రేవంత్… ఇప్పుడు పసుపు రైతుల కోసం ఒక రోజు దీక్షకు పూనుకున్నారు.