ఏడేండ్లుగా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఊరిస్తున్నారు కానీ ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా? అని రేవంత్ ప్రశ్నించారు. ఫతేనగర్ డివిజన్ ప్రచారంలో పాల్గొన్న ఎంపీ రేవంత్ రెడ్డి… ఇండ్లు ఇవ్వకుండా టిఆర్ఎస్ సన్నాసులు ఇవాళ మళ్లీ వచ్చి ఓట్లు ఎలా అడుగుతారని నిలదీయాలన్నారు.
వరదల్లో మనం బతికినమా లేదా కూడా కేసిఆర్ చూడలేదని, వరద సాయం పదివేలకు 5వేలు ఇచ్చి మిగిలినవి తిన్న టిఆర్ఎస్ వాళ్లను వంద మీటర్ల లోతు గుంత తీసి పాతిపెట్టాలన్నారు. మనం నీళ్లలో మునిగినప్పుడు ప్రధాని ఇంటికి 50వేల రూపాయలు ఇచ్చి ఉంటే మనకు ఆసరా అయ్యేదని, పైగా మతకలహాలు సృష్టించే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మరి నయా పైసా ఇవ్వని బిజెపి వాళ్లకు మనం ఓట్లు ఎలా వేయాలి? అని ఆలోచించాలని ఓటర్లను కోరారు.