కొడంగల్ ను దత్తత తీసుకుంటా… వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపడతా… వెనకబడ్డ కొడంగల్ మరో సిరిసిల్ల, సిద్దిపేట కావాలంటే రేవంత్ ను ఓడించండి అంటూ… ఓట్లు దండుకున్న కేటీఆర్ రెండేళ్ల వరకు మాట్లాడలేదు. కానీ జమిలీ ఎన్నికల హాంగామా నేపథ్యంలో అభివృద్ధి పథంలో కొడంగల్ అంటూ ట్విట్టర్ ద్వారా కొత్త పలుకులు మొదలుపెట్టారు.
కొడంగల్ అభివృద్ధి, మీ హాయంలో చేపట్టిన పనులు, ఇచ్చిన నిధులపై చర్చకు రెడీ అంటూ ఎంపీ రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కానీ చర్చలకు టీఆర్ఎస్ సాహసం చేయలేకోయింది. కొడంగల్ లో రోడ్ల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో చూడండి… అంటూ కేటీఆర్ కు రేవంత్ ట్వీట్ చేశారు. దద్దమ్మ దత్తతలో కొడంగల్ పరిస్థితి అంటూ ఓ పేపర్ లో ప్రచురితమైన గుంతలమైన రోడ్ల పరిస్థితిపై ఫైర్ అయ్యారు.
దద్దమ్మ “దత్తత” లో కోడంగల్ దుస్థితి…!!
@TelanganaCMO @KTRTRS pic.twitter.com/9jnJOUT80S— Revanth Reddy (@revanth_anumula) February 1, 2021
దత్తత తీసుకున్న నేతకు అటువైపు వచ్చే టైం లేదు. స్థానికేతరుడైన ఎమ్మెల్యేకు సమస్యలు పట్టవు… దత్తత సారు పరిపాలనలో కొడంగల్ ప్రజలం అనాథలైపోయామంటూ స్థానికులు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలు అభివృద్ధి చేస్తే మరీ ఈ రోడ్లు ఎందుకు వేయలేదని ప్రశ్నిస్తున్నారు.