ఢిల్లీలో శాంతియుతంగా కిసాన్ కవాతు చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జ్, బాష్పవాయువు గోళాలు ప్రయోగించటంపై ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ట్రాక్టర్ ర్యాలీ కి పోలీస్ లే అనుమతిచ్చి దాడి చేశారని మండిపడ్డారు.
ఢిల్లీ వీధుల్లో రైతన్న పై దాడి చేసిన చరిత్ర ప్రధాన మంత్రి మోడి కే దక్కుతోందన్నారు రేవంత్. ఇది రైతు ప్రభుత్వం కాదని.. అదాని, అంబానీల ప్రభుత్వమని ఆరోపించారు. డి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజే , నిరసన తెలిపే హక్కును కేంద్ర ప్రభుత్వం హరిస్తుందని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రైతుల డిమాండ్ ల వెంటనే పరిష్కరించాలి, రైతులపై దాడి చేసిన బీజేపీ కి పతనం తప్పదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
అన్నం పెట్టే రైతులపై దాడి అమానుషం… ఇప్పటికైనా ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలని వెనక్కి తీసుకోవాలి….అమిత్ షా జోడి పతనానికి ఇది నాంది.#IndiaWithFarmers pic.twitter.com/F1td6my2Jj
— Revanth Reddy (@revanth_anumula) January 26, 2021