గిట్టుబాటు ధర రాక పొలంలోనే వదిలేసిన టమాటా పంటను పరిశీలించిన ఎంపీ రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. పంట అమ్మితే కనీసం పెట్టుబడులు, కూలీ, రవాణా ఛార్జీలు కూడా రావడం లేదంటూ రైతులు తమ బాధను రేవంత్ రెడ్డితో పంచుకున్నారు.
తెలంగాణలో వ్యవసాయం బ్రహ్మాడంగా ఉందని కేసీఆర్ మాట్లాడుతున్నారని, కానీ ఈ రైతుల దీనస్థితి ఏమిటో ఇక్కడికొచ్చి చూస్తే తెలుస్తుందని మండిపడ్డారు. నువ్వు ఎలాగు ఫాంహౌజ్ నుండి ఎలాగు భయటకు రావని, కనీసం అధికారులను పంపించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ మాటలకు క్షేత్రస్థాయిలో పరిస్థితికి పొంతన లేదని… కార్పొరేట్ కంపెనీల ఒత్తిడితోనే రైతు ఉద్యమంపై మోడి సర్కార్ ఉక్కుపాదం మోపుతుందని విమర్శించారు. చట్టాలు రద్దు చేయకపోతే రైతులు మోడిని గద్దెదింపుతారన్నారు. మంగళవారం జరగబోయే పాదయాత్ర ముగింపు సభ అయిన రాజీవ్ రైతు భరోసా రణభేరి సభలో రైతు ఉద్యమంపై తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.