ఆర్టీసీ కార్మిక నేతల సమ్మె, ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై కార్మిక నేతలు మండిపడుతున్నారు. ఓవైపు కోర్టులు ఎన్ని మొట్టికాయలు వేస్తున్నా… మొండిపట్టుతో కార్మికుల జీవితాలతో ఆడుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులు ఐక్యంగా పోరాడుతూ… ఆత్మహత్యలు చేసుకోకుండా ధైర్యం నింపాలన్న ఉద్దేశ్యంతో… ఆర్టీసీ కార్మికులు సకల జనుల భేరీ సరూర్‌నగర్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. బుధవారం సాయంత్రం సభ జరగనుంది.
ఈ సభకు కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీ రేవంత్ రెడ్డి హజరుకాబోతున్నారు. కేసీఆర్ బయట ఓ మాట, కోర్టులో ఓ మాట చెబుతూ… ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శలు చేస్తున్న రేవంత్… ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా కేసీఆర్‌పై ఎలా రెచ్చిపోతారో చూడాలి అంటున్నారు కార్మికులు, కాంగ్రెస్ కార్యకర్తలు.