రాష్ట్రంలో పీసీసీ అధ్యక్ష మార్పు తప్పనిసరి అని తెలిసిన రోజు నుండి నేతలంతా ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. తమకు పరిచయమున్న ఢిల్లీ లీడర్లతో ఎవరి లాబీయింగ్ వారు చేస్తున్నారు. అయితే, పీసీసీ రేసులో ముందంజలో ఉన్న రేవంత్ రెడ్డి ముందస్తు ఆలోచనతో… పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తున్నట్లు కనపడుతోంది. కొంతకాలంగా ఢిల్లీలో కాంగ్రెస్ రాజకీయాలను, రేవంత్‌ను దగ్గరి నుండి చూసిన వారు ఎవరైనా అవును అని చెబుతున్నారు.
”నా పేరు రాహుల్ గాంధీ..రాహుల్ సావర్కార్ ” కాదు
ఎంపీగా తొలిసారి వచ్చిన అవకాశాన్ని వాడుకునేందుకు రేవంత్ రెడ్డి పర్‌ఫెక్ట్ స్కెచ్‌తో ఉన్నట్లు కనపడుతోంది. ఇప్పటి వరకు ఉన్న తెలుగు ఎంపీలెవరూ జాతీయ రాజకీయాల్లో ఆక్టివ్‌గా ఉండేవారు కాదు. పార్లమెంట్ ఉంటే వచ్చామా… వెళ్లామా అన్నట్లు ఉండేవారు. అవసరముంటే తప్పా కేంద్రమంత్రులను, తమ పార్టీ అధినాయకత్వాన్ని కలిసే వారు కాదు. కానీ రేవంత్ జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా పార్లమెంట్ డిబెట్స్‌లో కాంగ్రెస్ తరుపున చాన్స్ తీసుకుంటున్నారు. ఇష్యూస్‌పై మాట్లాడేందుకు ఆసక్తిగా ఉండటం, పైగా కాంగ్రెస్ తరుపున మాట్లాడే నాయకులు తక్కువగా ఉండటంతో… క్రమంగా రేవంత్ సోనియా దృష్టిలో పడ్డట్లు కనపడుతోంది. సోనియా కోటరిలో ఒకరిగా రేవంత్ దగ్గరవుతున్నారని… కాంగ్రెస్‌లో చర్చించుకుంటున్నారు.
తెలంగాణలో కొత్త ఉద్యోగాల భర్తీ లేనట్లేనా…?
జాతీయ పార్టీలో పీవీ తర్వాత అంత సమర్థంగా ఉన్న నాయకుడు కాంగ్రెస్‌కు దొరకలేదు. వైఎస్ చాలా విషయాల్లో కేంద్ర పార్టీని ఒప్పించినా.. రాష్ట్ర సమస్యల వరకే పరిమితం అయ్యేవారు. కానీ ఇప్పుడు ఎంపీగా రేవంత్‌కు మంచి ఎలివేషన్ దొరికింది, దాన్ని రేవంత్ కూడా బాగానే ఉపయోగించుకుంటున్నారని పలువురు తొలివెలుగు.కామ్‌తో అభిప్రాయపడుతున్నారు. రేవంత్ దూకుడు మనస్తత్వం కూడా సోనియా గాంధీ దృష్టిలో పడేలా చేసిందని తెలుస్తోంది.
అయితే, ఇప్పుడీ అంశం కూడా రేవంత్‌కు పీసీసీ దక్కేందుకు దోహదపడేలా చేస్తుందని ఆయన వర్గం బలంగా నమ్ముతోంది. ప్రధానిపై ఓ పరిణతి చెందిన జాతీయ నాయకుడిగా రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు కాంగ్రెస్‌లో రేవంత్‌కు అనుకూలతను తీసుకొస్తున్నాయని తొలివెలుగు.కామ్‌తో వ్యాఖ్యానించారు. అందుకే రేవంత్ తన పార్టీ ఆఫీస్ ఒపెనింగ్‌కు చాలా మంది సీనీయర్స్ దూరంగా ఉన్నా… రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇంచార్జీ మాత్రం వచ్చారని అభిప్రాయపడుతున్నారు.
రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వ్యవహరాల్లో… మరింత క్రీయాశీలకంగా మారుతారని, సోనియా కోటరీలో వచ్చిన భాగస్వామ్యాన్ని ఆయన రెండు చేతులా ఉపయోగించుకుంటారని రేవంత్ వర్గం నమ్మకంగా ఉంది.