హైదరాబాద్ లో ప్రభత్వ వైఫల్యంతోనే వరదలు వచ్చాయని ఎంపీ రేవంత్ రెడ్డి ఆరోపించారు. మీట్ ది ప్రెస్ లో మాట్లాడిన ఆయన మంత్రి కేటీఆర్ అనుచరులు వందల చెరువులను ఆక్రమించారన్నారు. ప్రపచంలో అత్యధిక అబద్ధాలున్న పుస్తకం ఎదైనా ఉందంటే అది టీఆర్ఎస్ ప్రగతి నివేదికని, అబద్దాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందన్నారు.
కేసీఆర్ సన్నిహితుల కోసమే హైదరాబాద్‌లో నాలుగు రోడ్లు వేశారన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్యంవల్ల హైదరాబాద్ మెట్రోకు 3,500 కోట్ల అదనపు భారం పడిందని ఆరోపించారు. ఎంఐఎం కోసం గౌలిగూడ వరకు మెట్రోను నిలిపివేసిందన్న రేవంత్… ఫలక్‌నుమా నుంచి ఎయిర్‌పోర్టుకు మెట్రోను వేయాలని రేవంత్ డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ సర్కార్ మొదటిసారి ప్రభుత్వంలోకి వచ్చినప్పుడే సిటీకి నలువైపుల నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు కడతామన్న హామీ ఏమైందని ఆయన ప్రశ్నించారు. కరోనా కాలంలో సీఎం రిలీఫ్‌ఫండ్‌కు 4వేల కోట్లు వస్తే వాటిని కూడా టీఆరెఎస్ నేతలే కాజేశారన్నారు. కేటీఆర్ మున్సిపల్ మంత్రి అయ్యాకే నాలాలు ఎక్కువగా కబ్జాకు గురయ్యాని విమర్శించారు.