మైనార్టీలకు కాంగ్రెస్ ఎనలేని ప్రాధాన్యత ఇచ్చిందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమానికి హాజరైన ఆయన, గోబెల్స్ సోదరులుగా మారిన మోదీ, అమిత్ షా హైదరాబాద్ పేరు మారుస్తామని విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు.
ఓవైసీ మాటలు విని మోనార్టీలు తెరాసకు ఓటేస్తున్నారు. కానీ, ముస్లింల ఓట్లతో తెరాస ప్రతిసారి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి మద్దతిస్తోందని ఆరోపించారు. ఎంఐఎం కూడా పరోక్షంగా బీజేపీకి సహరిస్తోందని విమర్శించారు. తెరాస, ఎంఐఎం కలిసి కాంగ్రెస్ను బలహీనపరచడం వల్లే బీజేపీ ఎదడగం, కేటీఆర్కు మార్గం సుగమం అవుతుందని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. వరద సమయంలో రాని బీజేపీ అగ్ర నేతలంతా ఇప్పుడు హైదరాబాద్ కు క్యూ కట్టారని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మైనార్టీలు బాగు పడాలన్నా, మైనారిటీ సోదరుల జీవన ప్రమాణాలు మెరుగుపడాలన్నా కాంగ్రెస్ ను ఆశీర్వదించాలని రేవంత్ కోరారు.