రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్, ఆయన ప్రభుత్వం కూడా పనిచేస్తుందని ఎంపీ రేవంత్ రెడ్డి విమర్శించారు. తమిళనాడు ఎన్నికల ఇంచార్జ్ గా కిషన్ రెడ్డి నియామకం వెనుక కూడా కేసీఆర్ హస్తం ఉందని, ఇప్పటికే తెలంగాణ ఇంటలిజెన్స్ అధికారులు తమిళనాడులో పర్యటిస్తున్నారన్నారు.
తమిళనాడులో పర్యటిస్తున్న ఇంటలిజెన్స్ అధికారుల అంశాన్ని భయటపెట్టాలని, విచారణకు ఆదేశించాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆరెఎస్ పార్టీ ఎన్డీఏలో భాగమని కాంగ్రెస్ భావిస్తుందని, బీజేపీ కోసం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. తెలంగాణను నిండా ముంచి లబ్ధిపొందేందుకు టీఆర్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆయన విమర్శించారు.
తమిళనాడులో బీజేపీకి అవసరం అయిన నిధులు కూడా కేసీఆర్ నుండే వెళ్తున్నాయని… అందుకోసమే కిషన్ రెడ్డిని సమన్వయకర్తగా నియమించారని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్ చేశారు.