అమిత్ షా డైరెక్షన్ లోనే బీజేపీ, ఎంఐఎం కుట్రలు పన్నుతున్నాయని ఎంపీ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతి రోజు రాత్రి బండి సంజయ్, అరవింద్ – అసద్, అక్బర్ ల మధ్య ఫోన్ కాన్ఫరెన్స్ నడుస్తోందని, వీటికి సంధానకర్తగా అమిత్ షా వ్యవహరిస్తున్నారన్నారు.
రాత్రి పూట అంతా కలిసి స్క్రిప్ట్ తయారు చేసుకోవడం, ఉదయం సరుభి నాటకానికి తెర లేతున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదని… బీజేపీ నిజంగానే వారిని గౌరవిస్తే వారిద్దరికి భారత రత్న ఇవ్వాలని రేవంత్ రెడ్డ డిమాండ్ చేశారు. ఈ నెల 29న హైదరాబాద్ వస్తున్న అమిత్ షా మహానేతల ఘాట్లను సందర్శించి, అక్కడే భారతరత్న ప్రకటన చేయాలన్నారు.
పీవీ, ఎన్టీఆర్ లాంటి మహానేతల పేర్లను బీజేపీ-ఎంఐఎంలు తుచ్ఛరాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం దుర్మార్గమని, సొంత పార్టీ నేతలైన అద్వానీ, జోషి, కల్యాణ్ సింగ్ లను గౌరవించుకోలేని బీజేపీ పరాయి పార్టీ నేతలపై ప్రేమ ఒలకబోస్తోందన్నారు. ఎన్నికల తర్వాత పీవీ, ఎన్టీఆర్ పేరు కూడా బీజేపీ ఉచ్ఛరించదని, ప్రజలు ఇలాంటి ఎమోషన్స్ విషయంలో అప్రమత్తంగా ఉండాల ని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.