ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు 85 వేల కోట్ల ఆర్టీసీ ఆస్తులను దోపిడీ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ డివిజన్ కేంద్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు ప్రకటించారు. 50వేల మంది కార్మికులు… సీఎం కుటుంబ సభ్యుల దోపిడిని పసిగట్టే సమ్మెకు దిగారన్నారు. ఆర్టీసీ కార్మికుల ప్రకటించిన తెలంగాణ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని, ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగ ఉపాద్యాయ సింగరేణి కార్మికులు కూడా మద్దతు ఉందని ప్రకటించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆత్మహాత్యలకు పాల్పడవద్దని విజ్ఙప్తి చేశారు.