ఎంపీ రేవంత్ రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేశారు. 10రోజుల పాటు పాదయాత్ర చేసి భారీ బహిరంగ నిర్వహించారు. అప్పటి వరకు స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ శ్రేణులన్ని ఒక్కసారిగా యాక్టివ్ అయ్యాయి. ఓవైపు పోటాపోటీ యాత్రలతో ఇతర పెద్ద నేతలు జిల్లాలకు వెళ్లటం కూడా కాంగ్రెస్ కు కలిసొచ్చింది.
దుబ్బాక ఉప ఎన్నిక, జీహెచ్ఎంసీ లో మంచి ఫలితాలు సాధించటంతో బీజేపీపై మంచి హైప్ ఉండేది. పైగా కాంగ్రెస్ నేతలంతా చెల్లాచెదురుగా ఉండటంతో… బీజేపీయే ప్రత్యామ్నాయం అన్న చందంగా వ్యవహరం కనిపించింది. కానీ సీన్ కట్ చేస్తే… రేవంత్ పాదయాత్రతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. రైతు ఇష్యూలో ప్రధానంగా బీజేపీ టార్గెట్ అయ్యింది. అంతేకాదు బీజేపీ, బండి సంజయ్ లు ఎంతసేపు మతాల అంశాన్ని వెలికితీసే ప్రయత్నం చేశారు కానీ రైతులు, ఉద్యోగులు, సామాన్య జనం సమస్యలను పట్టించుకోలేదు. కానీ రేవంత్ రైతుల కోసం పాదయాత్ర చేయటంతో బీజేపీకి వచ్చిన హైప్ కేవలం పాలపొంగు అన్నది స్పష్టంగా కనపడింది. కాంగ్రెస్ ను సైడ్ చేద్దామనుకున్న బీజేపీ… ఇప్పుడు ప్రజా సమస్యలను గాలికొదలటంతో తనే సైడ్ అయిపోతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
పైగా రేవంత్ రెడ్డి రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ ను రాష్ట్రానికి రావాలని కోరారు. రైతులతో పెట్టబోయే భారీ బహిరంగ సభకు ఆహ్వానించారు. ఇలా రైతుల కోసం రేవంత్ వేస్తున్న అడుగులు బీజేపీకి మైనస్ గా మారింది.