కేంద్రం తెచ్చిన మూడు కొత్త రైతు చట్టాలను నిరసిస్తూ… రేవంత్ రెడ్డి రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర చేస్తున్నారు. ఈ యాత్ర ముగింపు సందర్భంగా రావిరాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వరకు రేవంత్ రెడ్డి సహా నేతలు తలపెట్టిన ట్రాక్టర్ల ర్యాలీ సూపర్ సక్సెస్ అయ్యింది.
దారి పొడుగున జనం నీరాజనం పలికారు. దాదాపు మూడు గంటల పాటు ట్రాక్టర్ల ర్యాలీ జరిగిందంటే రోడ్లు అన్ని ఎంత కిక్కిరిసాయో అర్థం చేసుకోవచ్చు. ఈ ట్రాక్టర్ల ర్యాలీలో ఎంపీ రేవంత్ రెడ్డి స్వయంగా ట్రాక్టర్ నడపగా, మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు పలువురు మాజీ ఎంపీలు, మంత్రులు రేవంత్ తో ర్యాలీలో పాల్గొన్నారు.
ముందు నుండి రేవంత్ రెడ్డి, ఆయనతో ఉన్న వారు ఊహించిన దానికన్నా ఎక్కువగానే ర్యాలీకి రైతులు, కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చారు.