ప్రధాని తెలంగాణ పర్యటనలో ప్రధాని కార్యాలయం అనుసరిస్తున్న విధానంపై ఎంపీ రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాని భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న కరోనా వ్యాక్సిన్ కోవాక్జిన్ పరిశీలనకు వస్తున్నారు. శనివారం తన పర్యటనలో భాగంగా హకీంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకొని… అక్కడ నుండి నేరుగా సంస్థకు వెళ్తారు.
అయితే, ప్రధాని రాష్ట్ర పర్యటనలో స్థానిక ఎంపీ అయిన తనకు అవకాశం ఇవ్వకపోవటం సరైంది కాదన్నారు. లోకల్ ఎంపీకి తెలియకుండా కార్యక్రమాలు చేపట్టడం సరైంది కాదని లోక్ సభ స్పీకర్ కు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి ట్విట్టర్ ద్వారా ఫిర్యాదు చేశారు. హాకీంపేట ఎయిర్ పోర్టుతో పాటు భారత్ బయోటెక్ సంస్థ ఉన్న ప్రదేశం అంతా మల్కాజ్ గిరి పార్లమెంట్ పరిధిలో ఉంటుంది.
Hon'ble @PMOIndia is scheduled to visit Bharat Biotech Facility today.He will land at Hakimpet AFS. Both the facility & airport falls under Malkajgiri Constituency & it’s uncourteous on the part of the PM to not invite the local Member of Parliament @loksabhaspeaker @JoshiPralhad
— Revanth Reddy (@revanth_anumula) November 28, 2020