కేంద్రం తెచ్చిన మూడు కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు పోరాటం చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రైతులు చేస్తున్న ఉద్యమం 50రోజులు దాటింది.
ఈ వ్యవసాయ చట్టాల రద్దు, రైతుల ఉద్యమ కథాంశంగా పీపుల్స్ స్టార్ ఆర్. నారాయణ మూర్తి రైతన్న అనే సినిమా తెరకెక్కించాడు. పేద ప్రజల కోసం పోరాడే నారాయణ మూర్తి రైతుల కోసం సినిమా తీయటం అభినందనీయమని, పేదోడి కోసం కళాత్మకంగా పోరాడే ప్రజల మనిషి నారాయణమూర్తి గారు అంటూ ఎంపీ రేవంత్ రెడ్డి అభినందించారు.
కేంద్ర వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ సీనియర్ నటుడు నారాయణమూర్తి గారు ''రైతన్న'' పేరుతో సినిమా తీయడం అభినందనీయం. పేదోడి కోసం కళాత్మకంగా పోరాడే ప్రజలమనిషి నారాయణమూర్తి గారు #RepealFarmActsToday #farmerslivesmatter
— Revanth Reddy (@revanth_anumula) January 22, 2021