తేజస్వీ సూర్య. ఓ అనామకుడిగా బీజేపీ టికెట్ పొంది మొత్తం దేశాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు. పైగా బీజేపీ దక్షిణాధి రాష్ట్రాల్లో కీలక నాయకుడు మాజీ మంత్రి అనంతకుమార్ గీతే భార్యకు టికెట్ నిరాకరించి మరీ తేజస్వీ సూర్యకు టికెట్ ఇచ్చింది బీజేపీ అధినాయకత్వం. కాలం కలిసి రావటంతో ఎంపీగా గెలుపొందారు తేజస్వీ సూర్య.
అయితే, తేజస్వీ చదువుకున్న వ్యక్తే అయినా… ఇటీవల ఓ బాబాతో కలిసి పర్యావరణ రక్షణ కోసం, గ్లోబల్ వార్మింగ్‌ను తగ్గించేందుకు గ్లోబ్‌పై నీరు పోస్తూ ఉన్న ఓ ఫోటో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చిక్కింది. పంక్చర్ వాలాకు ఏమీ తెలియదు… గ్లోబల్ వార్మింగ్ తగ్గించేందుకు గ్లోబ్‌పై నీరు పోశారు మన ఎంపీ గారు. ఇంకా నయం… చల్లటి నీరు పోయలేదు మనమంతా ఐస్ గడ్డల్లో మునిగిపోయే వాళ్లం అంటూ సెటైర్స్ వేస్తున్నారు.
ఇప్పుడీ ఫోటో, ట్వీట్ వైరల్‌గా మారుతోంది.