బాదుడే బాదుడు పేరుతో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఏపీలో పెరిగిన ధరలు, ప్రభుత్వ వైఫల్యాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అయితే.. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ”అర్జంటుగా సైకియాట్రిస్టుకో, బూతవైద్యుడికో చూపించండయ్యా.. ముసలాడికి మెంటలో లేక గాలి సోకిందో, మతిపోయిందో తెలియట్లేదు” అంటూ సెటైర్లు వేశారు.
కోట్లాది మంది ప్రజలు ఎన్నుకున్న సీఎం, ప్రధానిని పట్టుకుని ఎవరువీళ్ళు ఉత్తరాంధ్రకు అంటున్నాడు.. గొలుసులు సిద్ధం చేసుకోండి తెలుగు తమ్ముళ్లూ.. అంటూ చంద్రబాబుపై కామెంట్ల వర్షం కురిపించారు సాయిరెడ్డి.
ఇదిలా ఉంటే.. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత స్పందించారు. సోషల్ మీడియా వేదికగా సాయిరెడ్డికి కౌంటర్ ఇచ్చారు ఆమె. పండుకోతికి పిచ్చి ముదిరిందని సంచలన వ్యాఖ్యలు చేశారు అనిత.
”మా నాయకుడు అడిగింది ఉత్తరాంధ్రలో ఏ2కు పనేంటని..? భూ కబ్జాలకా..? గంజాయి వ్యాపారానికా..? అక్రమ వసూళ్లకా..? అని ఏ2 గురించి ప్రశ్నించారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముసలి కోతికి అల్జీమర్స్ ఎక్కువై ఏ2 అంటే ఎవరో గుర్తుకు రావడం లేదనుకుంటా..? చంచల్ గూడా చిప్పకూడు అంటే అన్నీ గుర్తొస్తాయి”.. అంటూ సెటైర్లు వేశారు అనిత.